పల్నాడు జిల్లా కారెంపూడి సెయింట్ లూథరన్ చర్చ్ లో ఈ రోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పాస్టర్ డాక్టర్ రెవ. మాణిక్యరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేకంగా ఆహ్వానించబడిన పాస్టర్ జాన్ ప్రదీప్ కుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలో క్రైస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
