బొబ్బిలి నియోజకవర్గం లో భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క సేవలను బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కొనియాడారు.
గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బొబ్బిలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన శంబంగి వెంకట చిన అప్పలనాయుడు “మన్మోహన్ సింగ్ భారతదేశంలో అనేక ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేసిన మహానుభావులు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ గా, అలాగే దేశ ప్రధాని గా దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.
అనంతరం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. “మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటని ఆయన భావోద్వేగంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.