అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం చౌరస్తాలో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటానికి ఎంతో దోహదం చేశారని శశిధర్ రెడ్డి మాజీ ప్రధానికి నివాళులు అర్పిస్తూ, తమ ప్రసంగంలో అన్నారు. అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ దేశానికి మంచి ఆర్థికవేత్తగా దిశానిర్దేశం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొల్ల మల్లేష్, లక్ష్మీకాంత్ రావు, ఈశ్వర్ రెడ్డి, నర్రెగూడెం సతీష్, బంధంకొమ్ము శీను, సాయి కాలని మల్లేష్, శీను, భిక్షపతి, మల్లేష్, కృష్ణా యాదవ్, ఇక్రిశాట్ కాలని సలీం, మహేష్, మధురా నగర్ శీను, వెంకటేశ్వర రావు, బిల్లి శ్రీనివాస యాదవ్, రాఘవేంద్ర కాలని రమేష్, నవ్య సైది రెడ్డి, జయ, గోపాల్, రామచంద్రారెడ్డి, చుక్కారెడ్డి, శ్రీధర్, సృజనలక్ష్మి నగర్ ప్రవీణ్, మస్తాన్ నాయుడు, జీతప్ప, ఉస్కెబాయి సాయి, మరియు కె.ఎస్.జి. యువసేన, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు