అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నందు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు బి ఎస్ పి ఎంఆర్పిఎస్ మాల మహానాడు సంఘం జన విజ్ఞాన వేదిక సంఘం ఎస్ఎఫ్ఐ కెయు పేస్ మహిళా సంఘంల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి వి నిర్మల బి ఎస్ పి నాయకులు విజయ్ మాల మహానాడు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామాంజనేయులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ మాట్లాడుతూ పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ దగ్గర చేపట్టబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల సిపిఎం నాయకులు రామకృష్ణ డీఎస్పీ నాయకులు విజయ్ మాల మహానాడు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామాంజనేయులు మండల కార్యదర్శి మల్లికార్జున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దిలేటి మహిళా సంఘం నాయకురాలు కవిత ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్ యాదవ్ వంశి తదితరులు పాల్గొన్నారు.
