కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, తీర్యాని: చదువు ద్వారా మాత్రమే జీవితాలలో వెలుగులు నింపవచ్చని, భవిష్యత్తు తరాలు మారుతాయని, అభివృద్ధి బాటలో నడవడానికి తోడ్పాటు అవుతుందని, కాబట్టి చదువును ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని చదివించాలని, చదువు ద్వారా మాత్రమే ఒక సాధారణ వ్యక్తి ఉన్నత స్థానాలకు చేరుతారని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు.
జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో తీర్యాని పోలీసుల ఆధ్వర్యంలో మంగి గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మంగి చుట్టుపక్క గ్రామాల నుంచి ఆదివాసి ప్రజలు సుమారు 1000 మంది ఈ వైద్య శిబిరానికి హాజరు అయ్యారని అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, వృద్ధులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు.’
ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరడమైనది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు. అనంతరం మెగా వైద్య శిబిరం లో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు భోజనలు ఏర్పాటు చేశారు. వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ డిఎస్పీ కరుణాకర్, రెబ్బన సీఐ బుద్దే స్వామి. పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు.