చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,తుడా మాజీ చైర్ పర్సన్ చంద్రగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ చిత్రాలతో కూడిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ని వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి రూపొందించారు. ఈ క్యాలెండర్ ను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గురువారము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి నుంచి రాష్ట్రంలోని విద్యార్థులు యువత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలుస్తున్నారని తెలిపారు. దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్లు ,అందించి డాక్టర్లు ,ఇంజనీర్లు ,అయ్యేందుకు తోడ్పాటు అందించడమే కారణమని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో సచివాల వ్యవస్థ ద్వారా ఎంతోమంది సచివాలయ ఉద్యోగులు ,వాలంటీర్లుగా ,ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు .భవిష్యత్తులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులు యువత మద్దతుగా నిలవాలని కోరారు .వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలు ,ఆశయాలతో, యువత ,విద్యార్థి ఉన్నత భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని కోరారు. ఇందుకు అవసరమైన అన్ని విధాలుగా అండగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని తెలిపారు.కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, మోహన్ రెడ్డి .భూపాల్ .రాజశేఖర్ రెడ్డి. రవి .ఓం ప్రకాష్ రెడ్డి. ఓబులేషు. హరినాథ్ రెడ్డి .ముబారక్ .మధుసూదన్. రఫీ .హరికృష్ణ .తదితరులు పాల్గొన్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/Delhi-Assembly-Election-2025-_-46.55-Voter-Turnout-Recorded-Till-3-PM.webp)