అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలో ఉపాధి హామీ పనుల పైన జరుగుతున్న సామాజిక తనిఖీను సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపిడిఓ శ్రీకాంత్ చౌదరి కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు బి శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలోని పేదలు వ్యవసాయ కార్మికులు రెక్కల కష్టం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ చట్టాన్ని నమ్ముకొని జీవనం చేస్తున్నారన్నారు ఉపాధి హామీ చట్టం పేదలకు ఒక వరం లాగా ఉన్నదన్నారు ఇలాంటి చట్టాన్ని కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడుతూ యంత్రాలతో పనులు చేయిస్తూ కూలీల కడపు కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటివి వాటిపైన సమగ్రంగా సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పనులు దగ్గరికి వెళ్లి ప్రతి జాబ్ కార్డు లో పనులు చేసిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా విచారించి అవినీతి అక్రమాలను నిర్భయంగా బయటపెట్టాలని సూచించారు అలాగే ఉపాధి హామీ పనులలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మారుతీ ప్రసాద్ విద్యార్థి సంఘం నాయకులు వెంకీ చంద్ర తదితరులు పాల్గొన్నారు
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)