నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అభినయ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని ఎస్వీ ప్రజా వైద్యశాలలో పలు వ్యాధులపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. మెదడు సంబంధిత వ్యాధులపై ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వి అభినయ రెడ్డి గారు నెల్లూరు సిమ్స్ వైద్యశాలలో న్యూరాలజిస్ట్ వైద్యురాలుగా సేవలు అందిస్తున్నారు.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల మొదటి శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాలలో ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు..ఈ శుక్రవారం SVహాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ వెంకటేశ్వరరావు తో కలిసి హాస్పటల్ ప్రాంగణంలో రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. డాక్టర్ అభినయ రెడ్డి మరియు డాక్టర్ వెంకటేశ్వరరావు లు ఇక్కడికి వచ్చిన వారితో వ్యాధుల గురించి వాటి నివారణ గురించి అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా డాక్టర్ అభినయ రెడ్డి మాట్లాడుతూ తరచుగా కొందరిలో పలు రకాలుగా తలనొప్పులు వస్తూ ఉంటాయని దీనివల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని వీటిపై చిన్న అవగాహన కలిగి ఉంటే పెద్ద వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పడవచ్చు అని తెలిపారు.. తలనొప్పి రావడానికి కారణాలు వచ్చినప్పుడు ఉండే లక్షణాలను దాని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.. కార్యక్రమం అనంతరం డాక్టర్ అభినయ రెడ్డి మాట్లాడుతూ ముందస్తుగా కొంత అవగాహన కలిగి ఉంటే పక్షవాతము, ఫీట్స్ వంటి వ్యాధుల పట్ల జాగ్రత్త పడవచ్చని మెదడు సంబంధిత మరియు ఇతర వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వాటి బారిన పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.. తాను పతి నెల మొదటి శుక్రవారం ఆత్మకూరులోని ఎస్పీ ప్రజా వైద్యశాలకు వస్తానని ఈ ప్రాంత వాసులు న్యూరో సంబంధిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని వారు తెలిపారు.. ఈ అవగాహనకు రోగులు స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు.