contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Badangi : డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

విజయనగరం జిల్లా బాడంగి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఈ సందర్భంగా బొబ్బిలి శాసనసభ్యులు ఆర్ వి ఎస్ కే కే రంగారావు, బేబీ నాయన, బాడంగి జడ్పిటిసి పెద్దింటి రామారావు, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి టెంటు రవి, వైస్ ఎంపీపీ సింగిరెడ్డి భాస్కరరావు, బాడంగి సర్పంచ్ కండి రమేష్, ఎంఈఓ రాజేశ్వరి, ఎంఈఓ 2 లక్ష్మణ దొర, కాలేజ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బేబీ నాయన వ్యాఖ్యలు: ఎమ్మెల్యే బేబీ నాయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యత మైన భోజనం అందించడం అవసరం. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడటానికి, రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అమలు చేస్తుంది” అని తెలిపారు. ఆయన ఈ భోజనం విద్యార్థుల కోసం పోషకాహారాలు కలిగి ఉంటాయని, అందరూ ఈ భోజనాన్ని తినాలని సూచించారు.

భోజన మెనూ: ఈ మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మెనూ ఆరు రోజులపాటు అమలులో ఉంటుంది:

  1. సోమవారం: కూరగాయల పలావ్, కోడిగుడ్ల కూర, వేరుశనగ బెల్లం చెక్కి
  2. మంగళవారం: పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావా
  3. బుధవారం: కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం
  4. గురువారం: సాంబార్ బాత్ / లెమన్ రైస్, టమాటో పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
  5. శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం
  6. శనివారం: అన్నం, సాంబార్, కాయగూరల కూర, రాగి జావా, స్వీట్ పొంగల్

పిల్లలతో భోజనం: ఎమ్మెల్యే బేబీ నాయన విద్యార్థులతో కలిసి భోంచేసారు, ఇది విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :