- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్: సివిల్ సప్లై అమాలీలకు మద్దతుగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం. శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లయీస్ మరియు గిరిజన సహకార సంస్థ (జిసిసి) హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి నూతన రేట్ల ఒప్పందం అమలు, బకాయి వేతనాలు చెల్లిస్తూ వెంటనే జీఓ విడుదల చేయాలని, జీఓ విడుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం విడనాడాలని కోరుతూ గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించకుండా సమ్మె వచ్చిన్నానికి పాల్పడుతున్నది. 2025 జనవరి 6వ తేదీ (సోమవారం) జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వాలని సివిల్ సప్లయీస్ మరియు జిసిసి హమాలీ వర్కర్స్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. హమాలీలందరూ ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.