పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగసభను చలో విజయవాడ పేరుతో హిందూ జాగృతి కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో భారీ బహిరంగసభను నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కాకినాడజిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు రూరల్ మండలం చేబ్రోలు, దుర్గాడ, ఎ.కె.మల్లవరం, ఎ.పి.మల్లవరం, విజయనగరం గ్రామాల నుంచి భారీస్థాయిలో 6 బస్సులు, కార్లులలో హైందవbసోదరులు, సోదరీమణులు విజయవాడలో జరిగే హైందవ శంఖారావసభలో పాల్గొనుటకు బయలుదేరారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సత్తెమ్మతల్లి గుడి వద్ద నుండి బస్సులలో ర్యాలీగా బయలుదేరి విజయవాడకు ప్రయాణం అయ్యారు. ఈ 6 బస్సులు, కార్లును జ్యోతుల శ్రీనివాసు తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసి సభకు వెళ్ళే హిందువుబందువులకు అల్పాహారం, పులిహోర, త్రాగునీరు 400 మందికి వసతులను జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు కాషాయజెండాను ఉపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మామిడాల సూరిబాబు, కడిమిశెట్టి భాస్కరరెడ్డి, తట్టవర్తి చక్రవర్తి, సుంకర సోమన్నదొర, పాలపర్తి శంకర్, ఆమర్తి రామచంద్రరావు, చల్లా సోమేశ్వరరావు, దేవర అచ్చారావు, ఓరుగంటి సత్యనారాయణ, శాఖ నాగేశ్వరరావు (నాగు), గుండ్ర సీతారాం, కందా శ్రీనివాస్, జ్యోతుల సీతారాంబాబు, పెనుగొండ గంగాధర్, ఇంటి నాగేశ్వరరావు, పెనుగొండ వీరబ్బాయి, జ్యోతుల వాసు, ఇంటి వెంకటరమణ, శాఖ సురేష్, కాపారపు వెంకటరమణ (పూసలు), జ్యోతుల గోపి, మంతెన గణేష్, మేడిబోయిన హరికృష్ణ, జ్యోతుల శివశంఖర్, జ్యోతుల చిన్నయ్య తదితరులున్నారు.