- రైతు భరోసా పై రేవంత్ సర్కార్ మోసం
- బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ ములుగు నియోజక వర్గ ఇంచార్జీ
ములుగు : కట్టు కథల కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాపై మాట తప్పి రైతులను దగా చేసిందని ములుగు మాజీ జడ్పీ చైర్ పర్సన్, బీఆర్ ఎస్ పార్టీ ములుగు నియోజక వర్గ ఇంచార్జీ బడే నాగజ్యోతి విమర్శించారు. ఈమేరకు ఆదివారం బడే నాగజ్యోతి ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వాగ్ధానం చేసి నేడు మాట తప్పారన్నారు. రైతులకు ఎడాదికి రూ. 15000 ఇస్తామని మ్యానిఫెస్టోలో చేర్చి ఇప్పుడు రూ. 12000 వేలకు పరిమితం చేయడం రైతులను వంచించడమేనన్నారు. రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా రేవంత్ రెడ్డి సర్కారు యావత్తు రైతాంగాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాదిపాటు కాలయాపన చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొర్రీలు, కోతలు పెడుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా కు కోత పెట్టి ప్రతి రైతన్నకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుండె కోతును మిగిల్చిందన్నారు. నిబంధల సాకు చూపిస్తూ రైతు భరోసా ను కేవలం రూ. 12000లకు కుదించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసాపై మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారం లోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ప్రజల పక్షాన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని బడే నాగజ్యోతి స్పష్టం చేశారు.