శ్రీపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో సాహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లి లేదా తండ్రి లేని నిరుపేద విద్యార్థులకు సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిని ధనలక్ష్మి , ఎస్సై శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. సంక్రాంతి కానుకతో పాటు, గత సంవత్సరం వివిధ పాఠశాలల్లో 10 తరగతిలో అత్యధిక మార్పులు సాధించిన పదిమంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన ఐదు మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లు పంపిణీ చేశారు . అదేవిధంగా బీటెక్ చదువుతున్న నిరుపేద విద్యార్థినిలకు రెండు ల్యాఫ్టాఫ్ లు పంపిణీ చేశారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఈ ఫౌండేషన్ ద్వారా నిరంతరం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని ఫౌండేషన్ చైర్మన్ పడసాల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాల కు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు, టిడిపి మండల కన్వీనర్ అరికట్ల జనార్ధన్ నాయుడు, సెంచూరి ప్లేవుడ్ కంపెనీ ప్రతినిధులు, జూనియర్ కళాశాల లెక్చరర్,విద్యార్థిని,విద్యార్థులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.