మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో వృద్ధురాలి దారుణ హత్య కలకలం రేపింది. పత్తి కిష్టమ్మగా అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డులో హతమార్చారు. మండల కేంద్రంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగలు ఎవరో తెలియరాలేదు. డబ్బు కోసం హతమార్చారు లేక కావాలని చంపారా ! ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.