అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి, ఎన్టీఆర్ అమర్ రహే, అమర్ రహే అంటూ నివాళులర్పించారు ఈ సందర్భంగా గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తెలుగు వాడి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నటసార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు కేవలం 9 నెలలలోనే పేదవారికి కూడు, గూడు, గుడ్డ నినాదంతో కేంద్ర రాజకీయ పార్టీలను మట్టికరిపించి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రిగా విజయకేతనం ఎగుర వేశాడు. రెండు రూపాయలు కిలో బియ్యం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా ఉన్నది అన్నాడు. అనంతరం టిడిపి పార్టీను తన భుజస్కందాలపై మోస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అభివృద్ధి పొందాలంటూ ఎమ్మెల్యేలగా ,ఎంపీలుగా, మంత్రులుగా అవకాశాలు కల్పిస్తూ తిరుగులేని దిశగా పార్టీని నడిపిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల కన్వీనర్లు ఎంకే చౌదరి బద్రివల్లి జక్కలచెరువు ఎంపీటీసీ నారాయణస్వామి, చికెన్ శ్రీనివాసులు జక్కల చెరువు ప్రతాప్ వాల్మీకి సంగం జిల్లా కార్యదర్శి పిల్లెల్లి కృష్ణయ్య ఎర్రగుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు
