విజయనగరం జిల్లాకు వెనుకబడిన అనే పదం వినబడకుండా అభివృద్ధి అనే పదం వినబడేలా జిల్లాను చేస్తానని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె సభను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటిసారిగా జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి విచ్చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. విజయనగరం జిల్లా టిడిపి పార్టీకి కంచుకోట. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో నిరంకుశ పాలన నడిచింది. సంవత్సరంలో 365 రోజులు ఉంటే అందులో వంద రోజులు నాయకులు హౌస్ అరెస్టులతోనే గడపాల్సి వచ్చింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నేలమట్టం అయ్యేలా గత వైసిపి ప్రభుత్వం చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లో పంచాయతీ సర్పంచులలో లోలోపల ఆనంద పడుతున్నారు. వారి ఖాతాలో గ్రామాల అభివృద్ధికి నిధులు పడడంతో గ్రామాల అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి శూన్యం. గత ప్రభుత్వం పోలీస్ స్టేషన్లకు ఇన్వెస్టిగేషన్ చార్జీల గా ఇవ్వవలసిన పద్దెనిమిది వేల రూపాయలు సైతం, గత ఐదేళ్లు ఇవ్వకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో తిట్లు తిన్నాం దెబ్బలు తిన్నాం రక్తం చిందించాం.. అయినా టిడిపి కార్యకర్తలు ఇంతటి ఘన విజయాన్ని విజయాన్ని అందించి అధికారం లోకి వచ్చేలా కష్టపడిన ప్రతి కార్యకర్తను తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. అందుకు ఉదాహరణ మన పార్లమెంట్ సభ్యులు కలిసేట్టి అప్పలనాయుడే’ అని ఆమె కొనియాడారు. అనంతరం రాష్ట్ర చిన్న సూక్ష్మ ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దారుణమైన పరిపాలన వైసిపి ప్రభుత్వం చేసింది అన్నారు. సంక్రాంతి కి ముందే గ్రామాల్లో రోడ్లు వేయడంతో పల్లె ప్రజల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ జిల్లాకు నాడీ అన్నారు. వారంలో ఒకరోజు పార్టీ కార్యకర్తలకు కేటాయించాలని అన్నారు. జిడిపిలో విజయనగరం జిల్లా తక్కువలో ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ మూడవ దశలో జిల్లాకు నీరు అందించడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ పరిశ్రమలకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. తప్పుడు ఆలోచన విధానాలతో నడిచిన వైసిపి ప్రభుత్వం వలన పరిశ్రమలు పోయాయి అన్నారు. జిల్లాకు పరిశ్రమలు రానున్నట్లు తెలిపారు. తోటపల్లి తాటిపూడి మడ్డువలస డ్యాముల ద్వారా నీటిని తెప్పించి ఇంటింటి కొళాయిలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గతంలో అయితే హౌసింగ్ బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయో వాటికి ఒకేసారి జీవో వస్తుంది. ప్రతి ఒక్కరూ ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో డ్రగ్స్ జిల్లా వ్యాప్తంగా దొరికింది. దానిపై హోం మంత్రి వివరిస్తూ డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ శాఖ ద్వారా అనేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులకు ధాన్యం మిల్లుకు తరలించిన 48 గంటల్లోనే డబ్బులు వచ్చేలా చేసామన్నారు. స్థానిక ఎన్నికల్లో ఏ పంచాయతీ వదలకుండా గెలవడానికి కృషి చేయాలి అన్నారు. మొన్న జరిగిన ఇరిగేషన్ ఎన్నికల్లో 100శాతం గెలిచాం అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కూడా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో టూరిజం పబ్లిక్ ప్రైవేట్ సమన్వయంతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఒక్కరోజు కోటి సభ్యత్వాలు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఈ నెల 23వ తేదీన నారా లోకేష్ జన్మదిన సందర్భంగా భారీ రక్తదాన శిబిరం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసేటి అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. అందుకు నేనే ఒక ఉదాహరణ ఎక్కడో చిట్టచివర ఉన్న నా స్థానం పెద్దలు ఈరోజు అవకాశమిచ్చి వేదికపై కూర్చునేలా చేశారన్నారు. టిడిపి పార్టీ కార్యకర్తల సొత్తు అన్నారు. పార్టీని నమ్ముకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అని పిలుపునిచ్చారు. పార్లమెంట్ నిధులను అన్ని నియోజకవర్గాలకు సమానంగా ఇస్తానన్నారు. జిల్లాలో జిల్లా పార్టీ కార్యాలయానికి రెండు ఎకరాలను కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు , కోళ్ల లలిత కుమారి, కోండ్రు మురళీమోహన్ అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మాజీ మంత్రి, ప్రస్తుత అటవీ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు కొండపల్లి అప్పలనాయుడు, ఏపీ ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు మాజీ జిల్లా అధ్యక్షులు మహంతి చిన్నం నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు , వివిధ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కోటి సభ్యత్వాల సందర్భంగా టిడిపి పార్టీ సీనియర్ మాజీ శాసనసభ్యులు పతివాడ నారాయణస్వామి నాయుడు చేతులమీదుగా కేక్ కట్ చేయించారు ఈ సభా కార్యక్రమం అంతా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున అధ్యక్షతన జరిగింది.