జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ శ్వేత మృతిచెందారు. బైక్ ను తప్పించబోయి ఆమె కారు చెట్టును ఢీకొట్టింది. స్పాట్స్ లోనే ఎస్సై శ్వేత మృతి చెందగా, పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ డీసీఆర్‌బీలో పని చేస్తున్న ఎస్‌ఐ శ్వేతతో పాటు బైకుపై వెళ్తున్న వ్యక్తి సైతం దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ శ్వేత తన కారులో ధర్మారం నుంచి జగిత్యాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వాహనం, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారని పోలీసులు తెలిపారు.
ఎస్ఐ శ్వేత కారు అతి వేగంగా నడపడంతో ప్రమాదం తర్వాత సైతం కారు కొంతదూరం దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం డీసీఆర్‌బీ జగిత్యాలలో పని చేస్తున్న ఎస్‌ఐ శ్వేత.. గతంలో కథలాపూర్, పెగడపల్లి, కోరుట్ల, వెల్గటూరులలో ఎస్‌ఐగా సేవలు అందించారు.