నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం: “సమాజంలో అందరూ సమానమేనని” ప్రజల మౌలిక హక్కులపై అవగాహన పెంచేందుకు, గ్రామసభలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అనంతసాగర గ్రామంలోని గిరిజన కాలనీలో పౌరహక్కుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి అనంతసాగర మండల తహసిల్దార్ సుభాషిని అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు శేషం.సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. “సమాజంలో అసమానతలు, అంటరానితనం, అస్పృశ్యత వంటి సమస్యలను నిర్మూలించడమే ఈ పౌరహక్కుల చట్టం ప్రధాన లక్ష్యం” అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజేశ్వరి, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.