న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆర్థిక మోసాలను ఆరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు కీలక మార్పులను తీసుకురాబోతుంది.
ఆర్‌బీఐ, ఇక నుంచి భారత బ్యాంకుల వెబ్ డొమైన్ ‘బ్యాంక్.ఇన్’ (Bank.in) గా ఉండాలని నిర్ణయించింది. అలాగే, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకి ‘ఫిన్.ఇన్’ (Fin.in) డొమైన్ కావాలని సూచించింది. డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై ప్రజల నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా ఉంది.
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, “ఈ నిర్ణయం, దేశంలో డిజిటల్ పరిశ్రమకు మరో మెరుగైన దిశనివ్వడమే కాకుండా, బ్యాంకులకు ప్రత్యేకంగా డొమైన్ ఉండడం ద్వారా వినియోగదారులకు విశ్వాసాన్ని పెంచే ఉపాయం అవుతుంది” అని చెప్పారు.
ఈ నిర్ణయం అమలులోకి రావడంతో, ఏప్రిల్ 2025 నుండి ‘బ్యాంక్.ఇన్’ డొమైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని గవర్నర్ తెలిపారు. ఆ తరువాత ‘ఫిన్.ఇన్’ డొమైన్ రిజిస్ట్రేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో “ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ” (IDRBT) సంస్థ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుంది.
అలాగే, దేశంలో జారీ చేసిన కార్డుల ద్వారా విదేశాలలో లావాదేవీలకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ)ను జోడించనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ విధానం ద్వారా విదేశాల్లో గతంలో చాలా సార్లు ఎదురైన సెక్యూరిటీ కమప్రమైజ్ మసలాదులను కట్ చేస్తూ, మరింత సురక్షితమైన లావాదేవీలు నడపనుందని తెలిపారు.