పార్వతీపురం మన్యం : వైసిపి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు రానున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల వైసిపి సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పాలకొండకు రేపు రానున్న సందర్భంగా అందుకు తగిన ఏర్పాట్లుపై చర్చించేందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ముఖ్య నాయకులతో కలిసి బుదవారం దివంగత పాలవలస రాజశేఖరం తనయుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేపటి పర్యటనపై చర్చించడం జరిగింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ..
పర్యటన వివరాలు రేపు 20వ తేదీన 12.40 గంటలకు విశాఖ కు చేరుకోనున్నారు, అక్కడ నుండి 1.15 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. పాలకొండ హెలిపాడ్ నుంచి 2.15 గం టలకు పాలకొండలో గల ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి రోడ్డు మార్గం గుండా చేరుకుంటారు. పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్మోహ న్రెడ్డి పరామర్శించి దాదాపు గంట సమయం పాటు ఇక్క.డ ఉండనున్నారు అని తదుపరి సాయంత్రం 3.30 గంటలకు పాలకొండ నుంచి తిరిగి బయలుదేరనున్నారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బలిజీపేట మండలం పార్టీ అధ్యక్షులు పాలవలస మురళీకృష్ణ, ఎంపీపీ ప్రతినిధి మజ్జి శేఖర్, కౌన్సిలర్ సభ్యులు అర్ చిన్నం నాయుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.