contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  •  కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపం
  • సిసిఐ కొనుగోళ్లపై సిబిఐ విచారణ జరపాలి
  •  బిజెపి కేంద్రమంత్రులు,ఎమ్మెల్యే,ఎంపీలు ఏం చేస్తున్నారు
  •  బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా /  సిర్పూర్ :  కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపమైందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాహార్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఈ రోజు సిర్పూర్ కాటన్ మిల్లు వద్ద పత్తి రైతులను కలిసి, పత్తి మిల్లుల యాజమాన్యాలను కలిసి అక్కడి పరిస్థితులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతోమాట్లాడుతూ, సిసిఐ కొనుగోలు ఆపడం వల్ల రైతులునష్టపోయారని, సాంకేతిక లోపాలని చెబుతూ, ప్రైవేట్ దళారులకు లాభం చేకూర్చే కుట్రచేశారనిఆరోపించారు. సిసిఐ సాంకేతిక లోపాలు అని చెప్పడం అనుమానంగా ఉందన్నారు. అందుకే సిసిఐ కొనుగోళ్లపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తేమ, క్వాలిటీ వంటి నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, 15 రోజులపాటు రోడ్లపై పడిగాపులు కాసేలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సిసిఐ కొనుగోలు చేయకపోవడం వల్ల క్వింటాల్ కు 7421 రూపాయల బదులు, దళారులు 6500 రూ.లకు క్వింటాల్ చొప్పున కొని రైతులకు అన్యాయం చేశారని తెలిపారు. రైతులకు ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పత్తి కొనుగోలుకు సంబంధించి సిసిఐతో గానీ,కేంద్రప్రభుత్వంతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వ్యవసాయశాఖ మంత్రి రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు బిజెపి కేంద్ర మంత్రులు,8 మంది ఎంపిలు,స్థానిక సిర్పూర్ ఎమ్మెల్యే కూడా ఎందుకు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కేంద్ర వ్యవసాయమంత్రితో మాట్లాడి, సిసిఐ మార్చి 15 వరకు పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో,ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గం పత్తి పంటకు పేరుగాంచిందన్నారు. కేసిఆర్ ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాలేదని గుర్తుచేశారు. రైతులు పులులు, అడవి పందులు, ఎరువులు, మందులు వంటి అనేక సమస్యలు అధిగమించి పంట పండిస్తే, ప్రైవేట్ వాల్లకు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. సమయానికి రైతుబంధు ఇచ్చి పెట్టుబడి సాయం చేసేవారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత, రైతు భరోసా, రైతు రుణమాఫీ, కౌలు రైతులకు 15000, రైతు కూలీలకు 12000 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని, మార్చి 15 వరకు సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయకుంటే రైతులందరం కలిసి జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :