గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ గుత్తి పట్టణంలోని వెలుగు ఆఫీస్ వద్ద కోళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గుత్తి మండలం మహిళా సంఘాల లోగల 30 మంది ఎస్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఒక్క యూనిట్ గా 11 కోళ్లు 5 పుంజులు చొప్పున, ఒక్క యూనిట్ 6000 రూపాయలు, ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 3600, లబ్ధిదారుల వాటా 2400రూపాయలకు ప్రభుత్వం అందిస్తుంది. మీకు అందించిన ఒక యూనిట్ 11 యూనిట్లుగా వృద్ధి చేసి 6000 లను 66000 సంపాదించాలని ఆకాంక్షించారు. దీనితోపాటు కోళ్ల పెంపకానికి 30 కేజీల దాన, వాటికి సరిపడా ఔషధాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టే ఇలాంటి మంచి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జక్కలచెరువు ఎంపీటీసీ నారాయణస్వామి ఏపీఒ ఎం అరుణకుమారి, జనసేన పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, టిడిపి నాయకులు బద్రివలి, పిల్లెల్లె కృష్ణయ్య, న్యాయవాది సోమశేఖర్, సరోజ,కళ్యాణి, జనసేన నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య ఓబులేసు వెంకటపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.