జగిత్యాల జిల్లా,మెట్ పల్లి : విద్యార్థులు భవిష్యత్ తరాలకు చెందిన శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్‌లు ఎంతగానో దోహదపడతాయని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బీజేపీ సీనియర్ నేత ప్రముఖ వైద్యులు చిట్నేని రఘు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని నిఖిల్ భరత్ కాన్వెంట్ హైస్కూల్ లో శుక్రవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్ ఫో కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన పలు సైన్స్ ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విధమైన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. ఇందులో దాదాపు 1000కి పైగా ప్రాజెక్టులు నిర్వహించడం . అదే విధంగా నిఖిల్ భరత్ కాన్వెంట్ హైస్కూల్ యాజమాన్యం 25 సంవత్సరాలుగా ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనను అందిస్తున్నారన్నారు. ఇక్కడ చదువుకున్న వారిలో సుమారుగా 85 మంది విద్యార్థులు వైద్య వృత్తిలో, 100 వందమంది విద్యార్థులు ఇంజనీర్లుగా సేవలు అందిస్తూ ఉండడం అభినందనీయమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లో కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంపికవడం చాలా గొప్ప విషయమని అంతేకాకుండా అమెరికా, లండన్, జర్మనీలాంటి దేశాల్లో సైతం ఇక్కడి విద్యార్థులు వివిధ విభాగాల్లో పనిచేస్తుండడం . అనంతరం పాఠశాల నిర్వాహకులను నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి సత్కరించారు. కాగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘును పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, పాఠశాల వ్యవస్థాపకులు, మండల విద్యాధికారి మేకల చంద్ర శేఖర్, ప్రధానోపాధ్యాయులు వీ.బీ మహర్షి, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, న్యాయవాది ఆకుల ప్రవీణ్, నాయకులు జియా హుల్ హక్, మార్గం హన్మాండ్లు, అంగడి పురుషోత్తం, బర్ల రమేష్, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
