విజయనగరం జిల్లా: బాడింగి కేంద్రంలో తాసిల్దార్ సుధాకర్ విఆర్వోలతో సమావేశమయ్యారు. గ్రామాలలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని వీఆర్వోలకి ఆదేశించారు. గత ప్రభుత్వం లో పట్టాలు ఇచ్చిన ఇళ్ళ స్థలాలలో ఎంతమంది నివాస గృహాలు కట్టుకున్నారో వివరాలు సేకరించమని తెలిపారు. అలాగే పలు అమాశాలపై విఆర్వోలతో చర్చించారు. ఈ సమావేశంలో మండలంలోని విఆర్వోలు పాల్గొన్నారు.
