కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద AMR ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ లో ఎనిమిది రోజుల క్రితం జరిగిన దుర్ఘటన స్థలాన్ని పరిశీలించిన భారతీయ జనతా పార్టీ శాసన సభ పక్ష నాయకులు.
సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న పలు విషయాలను శాసన సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.
టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా పగిలిపోయిందని, దుర్ఘటన జరిగిన ప్రాంతంలో చిక్కటి బురదలో కార్మికులు చిక్కుకుపోయి ఉన్నారని, సహాయక చర్యలను వేగవంతం చేశామనితెలిపారు.
ఈ సందర్భంగా శాసన సభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని, సహాయక చర్యలను వెంటనే వేగవంతం చేసి కార్మికుల ఆచూకీ కనుగొనాలని తెలిపారు. సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ టన్నెల్ లో కూరుకుపోయిన చిక్కటి బురదను వెలికితీయడమే పెద్ద సమస్యగా మారిందని, ఈ దుర్ఘటన పై సమగ్ర విచారణ జరపాలని, భవిష్యత్ లో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు పాయల్ శంకర్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.