జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణ శివారులోని ఎస్ అర్ ఫంక్షన్ హాల్ వద్ద, శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, రాంగ్ రూట్ లో అతివేగంగా ప్రయాణిస్తూ, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 65 సంవత్సరాల జావిడి నర్సారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో జావిడి నర్సారెడ్డి భార్య 60 సంవత్సరాల అనసూయ తీవ్ర గాయాలు పొంది, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
మెట్ పల్లి డిపో నుంచి వివి రావుపేటకు వెళ్ళే ఆర్టీసీ బస్సు, రాంగ్ రూట్ లో అత్యధిక వేగంతో వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బస్సు బైక్ను ఢీకొట్టి, నర్సారెడ్డిని కొంత మేర ఈడ్చుకెళ్లిందని, ఈ విషయాన్ని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.