మెదక్, తూప్రాన్: జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారి ఆదేశాలమేరకు ఈనెల 8 వ తేదిన మెదక్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ నిర్వహించ బడుతుంది. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తెలిపారు మంగళవారం మెదక్ కోర్టు ఆవరణ నుండి సీనియర్ సివిల్ జడ్జ్ జితేందర్ ఈనెల 8న జరుగు లోక్ అదాలత్ పై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీమార్గమే రాచమార్గము అనే సదుద్దేశ్యంతో కక్షిదారులకు త్వరిత మరియు సమ్మతమైన న్యాయం సులువుగా అందుబాటులో ఉండాలని దేశవ్యాప్తంగా ఈనెల 08 జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ బడుతుంది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ గారి ఆదేశాల మేరకు కక్షిదారుల సౌకర్యార్థం ఈ నెల 1వ తేది నుంచే లోక్ అదాలత్ బెంచీలను ఆయా న్యాయస్థానాలలోనే ఏర్పాటు చేశామని చెప్పారు.. వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూమి తగాదాలు, డబ్బు తగాదాలు, ప్రమాదాల పరిహారం కేసులు, చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఇలా వివిధ రకాల కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సుహ్రుద్భావ మార్గం. అని అన్నారు అంతే కాకుండా కోర్టులో కేసువేసే అర్హత కలిగిన సమస్య ఏదైనా కేసు వేయకుండా ప్రిలిటిగేషన్ సెటిల్మెంట్ ద్వారా ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. క్షణిక ఆవేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉం డదని, విలువైన సమయం, మనశాంతి మరియు డబ్బు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. పేదరికరం తో ఉన్నటువంటి వారు, న్యాయ సహాయం కావాల్సిన వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థను నేరుగా సంప్రదించాలని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో వేగంగా కేసులు పరిష్కారం అవటమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. కక్షిదారులు న్యాయస్థానానికి కట్టిన కోర్టు ఫీజు తిరిగి పొందవచ్చు అని వివరించారు.. లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కక్షిదారులకు న్యాయసమ్మతమైన కక్షిదారుల సమ్మతమైన నిబంధనలతో అవార్డు ఇస్తారన్నారు. దీని మీద అప్పీలుకి వీలులేక పోవటం వల్ల ఇదే చివరి తీర్పు అవుతుందని చెప్పారు. కావున మెదక్ జిల్లా కక్షిదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని, మరియు ప్రజలందరూ ఒక సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా జీవించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కోరుతుంది.
