జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన ఫోన్ వివరాలను CEIR Portal లో నమోదు చేస్తే తిరిగి ఫోన్ ను పొందే అవకాశం ఉంటుందని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎస్సై అనిల్ అన్నారు. వేముల కుర్తి గ్రామంలోని పౌల్ట్రీ ఫారం లో పనిచేసే మహమ్మద్ అత్తర్ ఫిబ్రవరి 19వ తేదీన ఫోన్ పోయినదని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేసుకొని పోగొట్టుకున్న ఫోన్ ను ఈరోజు ట్రేస్ అవుట్ చేసి మహమ్మద్ అత్తర్ కు అందజేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎవరికైనా మొబైల్ ఫోన్లు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఎస్సై అనిల్ తెలియజేశారు.
