కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ ) కోర్టులో జడ్జి, న్యాయవాదుల ఆధ్వర్యంలో మహిళ న్యాయవాదులను శాలువతో ఘనంగా సత్కరించి ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి అజయ్ ఉల్లం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఓ చారిత్రాత్మక ఉద్యమమే మహిళా దినోత్సవంగా మారింది పనిగంటలు తగ్గించమని కోరుతూ మహిళలు చేపట్టిన ఉద్యమం దేశ దేశాల్లో మహిళా దినోత్సవంగా ఉద్భవించింది. నేటి సమాజంలో మహిళలు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షలను వదిలి, మగవారితో సమానంగా అవకాశాలు కల్పించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. ఒకప్పుడు మహిళలు ఇంట్లోంచి బయటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మహిళలకు విద్య అందింది. ఓటు హక్కు వచ్చింది.ఉద్యోగాలు చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. అంతరిక్షాన్ని తాకుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. చిన్నప్పుడే పెళ్లిళ్లు చేయడం, సతీసహగమనం వంటి వాటికి నుంచి విముక్తి లభించింది. ఇప్పుడు మగవారితో సమానంగా ఎదుగుతున్న మహా వృక్షాలు,ప్రపంచంలో విజయాలు సాధిస్తున్న ప్రతి మహిళకు శుభాభినందనలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ న్యాయవాది, ఏపిపి ఎలీషా , అడ్వకేట్స్ సతీష్, గణపతి, కళ్యాణ్, విజయ్, పోలీస్ సిబ్బంది ,మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.