కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సంఘాల అభివృద్ధి దిశగా హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో శనివారం సాయంత్రం మహిళా సంఘాల అద్దె బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుండి బయలుదేరుతున్న రెండు బస్సులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా మహిళ సంఘాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ప్రతి మహిళ సమాఖ్యకు ఒక బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్.టి.సి. కి ఇస్తున్న సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా నుండి మహిళా సంఘాల నాయకులు 100 మంది,రెండు బస్సులలో వెళ్తున్నారని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
