- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ తాండ్ర నరేష్
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో మహిళను వేధించిన కేసులో మండలం లోని మాదాపూర్ గ్రామానికి చెందిన సంపత్ ఉదయ్ కుమార్ తో పాటు తన వెనుకాల ఉండి నిరాధారణ, అసత్య వార్తలు రాసే ఆరుగురు పత్రికా విలేకరులపై కేసు నమోదు చేశారు. మహిళపై వేధింపుల కేసులో వెలుగు దినపత్రిక రిపోర్టర్ పాశం ఎల్లయ్య, ఆంధ్రజ్యోతి విలేఖరి బూర తిరుపతి, పులి సంతోష్ గౌడ్ ఆంధ్రప్రభ రిపోర్టర్, మూడికే రమేష్ రణం రిపోర్టర్, ఓరుగంటి సంపత్ నవతెలంగాణ రిపోర్టర్, గుడాల శ్రీనివాస్ దిశా రిపోర్టర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తాండ్ర నరేష్ తెలిపారు.