విజయనగరం జిల్లా :బాడంగి కి దగ్గర్లో ఆయుధ డిపో ప్రతిపాదనలు ఆపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు మండల సిపిఎం పార్టీ నాయకులు ఏ.సురేష్ పాల్తేరు ఎంపీటీసీ సభ్యులు సర్పంచి ప్రతినిధి అప్పలనాయుడు గ్రామ పెద్దలు రైతులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నావికాదళం అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలన పేరుతో ఆయుధ డిపోకు సుమారు 1800 ఎకరాలు అవసరం ఉంటుందని ఇందులో ప్రభుత్వ భూమి 300 ఎకరాల వరకు ఉన్నదని మిగతా 1500 ఎకరాలు పాల్తేరు, రామచంద్రపురం, ముగడా, కోడూరు మల్లంపేట తదితర గ్రామాల రైతుల నుండి భూమిని సహకరించాలని ప్రతిపాదన చేస్తున్నారు. ఆయుధ డిపో ఈ ప్రాంతంలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రైతులు అన్నారు. సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను ఈ ఆయుధ డిపో కి ఇవ్వవలసిన అవసరం మాకు లేదని అన్నారు. ఈ ప్రాంతాన్ని తీవ్రంగా నష్టం చేసే ఈ డిపో మాకు అక్కర్లేదని తెగేసి చెప్పారు. బలవంతంగా ప్రభుత్వాలు ఆయుధ డిపో పెట్టాలనే నిర్ణయం చేస్తే మా ప్రాణాలుకు తెగించైనా పోరాడుతామని అన్నారు. డిప్యూటీ తాసిల్దారు గారికి వినస పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.
