- 14 సంవత్సరాల చిన్నారికి అవని హాస్పిటల్ లో ఉచిత ఆపరేషన్
మెట్ పల్లి మండలం లోని మేడిపల్లి గ్రామానికి చెందిన బండ్ర రాధ ధర్మరాజు దంపతుల కూతురు భవ్య శ్రీ 14 సంవత్సరాల పాపకు చాతిలో కనితి ఏర్పడడంతో గత కొంత కాలంగా చాలా ఇబ్బంది పడడంతో పాప తల్లిదండ్రులు హాస్పిటల్లో చూపించగా చేతిలో కనితి పెరుగుతుందని ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేయించడానికి 50 నుండి 80 వేల రూపాయల వరకు అవుతుందని చెప్పగా, వారిదెగ్గర అంత డబ్బులు లేకపోవడంతో పాప పరిస్థితి ఏమవుతుందని అయోమయంలో పడ్డారు, ఆ చిన్నారి పడుతున్న బాధను చూస్తూ ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉన్న దంపతులకు విషయం తెలుసుకున్న నిత్య సాయి హాస్పిటల్ డాక్టరు హేమ రఘు వారు స్పందించి చిన్నారికి ఏమి కాదు అని మేము మా హాస్పిటల్ లో ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు, చెప్పినట్టుగానే చిన్నారికి మంగళవారం వారి అవని హాస్పిటల్ కొంపల్లి హైదరాబాదులో ఉచితంగా ఆపరేషన్ జరిపి ఆ పేద కుటుంబానికి అండగా నిలిచారు, అంత మంచి మనసు ఉన్న డాక్టర్ రఘు హేమ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు, విషయం తెలుసుకున్న మెట్ పల్లి పరిసర ప్రాంత ప్రజలు డాక్టర్ రఘు హేమని ఈ సందర్భంగా అభినందించారు.