చిత్తూరు జిల్లా, పలమనేరు: ఆర్డీవో కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భూనిర్వాసితులు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. చౌడేపల్లి మండలంలోని బోయకొండ నిర్వాసితులు 2022లో తాము నివసిస్తూ దుకాణాలు నడుపుకుంటున్న 120 మంది దుకాణాలు ఇళ్లు, కూల్చేసి రోడ్డున పడేసారని తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డీవో ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్డీవో భవాని మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి పరిశీలించి తగు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఓబులరాజు బాధిత ప్రజలు పాల్గొన్నారు.
