చిత్తూరు జిల్లా, పలమనేరు: ఎమ్మార్వో కార్యాలయం నందు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎమ్మార్వో ఇన్బనాధన్ కు వీఆర్ఏలు వినతి పత్రం అందించారు. సిపిఎం నియోజకవర్గ నాయకుడు ఓబుల్ రాజు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా కేవలం 11 వేల రూపాయల లోపు శాలరీ తీసుకుంటూ ఎమ్మార్వో కార్యాలయాల నందు పగలు రాత్రి లేకుండా గొడ్డు చాకిరీ చేస్తున్న వీఆర్ఏలను గత ప్రభుత్వం ఆదుకోలేదు మీ సమస్యలుపరిష్కరిస్తామంటూ అధికారంలోకి వచ్చినా ఈ ప్రభుత్వము ఆదుకోలేదన్నారు. కనీస వేతనం నెలకు 26,000 వారికి అందించాలని డిమాండ్ చేశారు.
