contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఖాసీంపేట లో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ని పురస్కరించుకొని గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలో నగునూరి మధుబాబు ఆధ్వర్యంలో కాసింపేట గ్రామ మాజీ సర్పంచ్ గంప వెంకన్న మల్లేశ్వరి, మాజీ ఎంపీటీసీ ఏలేటి స్వప్న చంద్ర రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రాహానికి పుల మాల వేసి అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దార్శనికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్దంగా సాధ్యమైందని అన్నారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి, ప్రముఖ సంఘ సంస్కర్త , పేద బీద ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరపడం మన కర్తవ్యం అని అన్నారు. దేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. కుల వివక్షకు తావులేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు బాబాసాహెబ్ అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనవన్నారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్నదని గుర్తు చేసుకున్నారు.గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసి, సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాక్రమంలో అమలు పరుస్తున్న ఆర్ధిక సామాజిక విధానాలలో బాబాసాహెబ్ ఆశయాలు ఇమిడిఉన్నాయని ఆయన తెలిపారు.దళిత, గిరిజన బిడ్డలు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా..ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గురుకులాలు సాధిస్తున్న అద్భుత విజయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు. గురుకులాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యతో పాటు పలు అనుబంధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు వారికి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణను ఇప్పించింది అన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దళిత, గిరిజన బిడ్డలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతుండడాన్ని ప్రపంచం ప్రశంసిస్తున్నదని ఆనందం వ్యక్తం చేశారు. విదేశీ విద్యానిధి ద్వారా దళిత గిరిజన బిడ్డలకు ఆనాడు తెలంగాణ రాష్ట) ప్రభుత్వం విదేశీ విద్యను అందించిందని గుర్తుకు చేసారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు నగునూరి స్వామి, నగునూరి మల్లయ్య, నగనూరి శంకర్, నగనూరి పర్షయ్య, బీసీ సంఘం అధ్యక్షులు బొజ్జ శ్రీకాంత్ మరియు బద్దం రమణారెడ్డి, సింగిరెడ్డి లక్ష్మీకాంతరెడ్డి, సంధవిని ఐలయ్య, బద్దం వెంకన్న, జి రమణారెడ్డి, కటుకూరి రమేష్ బాబు, గంప మహేష్, మంద రాజు, బొజ్జ తిరుపతి, ఏలేటి సతీష్, బండి తిరుపతి, బత్తుల అక్షయ్, బొజ్జ మహేష్, మునిగంటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :