తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. చాలా చోట్ల సాయంత్రం 5 తర్వాత కూడా క్యూలైన్లు కిక్కిరిసాయి. గడువులోగా లోపలికొచ్చిన అందరికీ ఓటేసే అవకాశం కల్పించామని ఎన్నికల అధికారులు చెప్పారు. 9 కార్పొరేషన్లలో 324 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లోని 2647 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈనెల 25న వెలువడనున్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference