ఆసీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా పది వికెట్ల తేడాతో ఒక వన్డేలో ఓటమిపాలవ్వడం భారత్‌కు ఇది ఐదోసారి కాగా… 2005లో దక్షిణాఫ్రికాతో పరాజయం తర్వాత ఇంతటి భారీ ఓటమి చవి చూడటం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా రెండో వన్డేలో భారత్ తన లోపాలను సరిదిద్దే పనిలో పడింది. బ్యాటింగ్ ఆర్డర్ వైఫ్యలం వల్లే మ్యాచ్ చేజారడంతో విరాట్ కోహ్లీ జట్టులో పలు మార్పులు చేసేందుకు సన్నద్ధమయ్యాడు. ఇప్పటికే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కంకషన్ కారణంగా రెండో వన్డేకు దూరం కావడంతో.. కెఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే మొదటి వన్డేలో ఈజీ స్టంపింగ్‌ను అతడు మిస్ చేయడంతో.. స్టేడియం మొత్తం ‘ధోని.. ధోని..’ అంటూ మారుమ్రోగింది. అందువల్ల సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాహుల్‌కి కూడా ఉద్వాసన పలికే యోచనలో ఉన్నట్లు సమాచారం. రోహిత్, ధావన్‌లు ఓపెనింగ్ జోడి కాగా, విరాట్ కోహ్లీ వన్ డౌన్లోనే దిగనున్నాడు. శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌లు ఆ తర్వాత బ్యాటింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. మొదటి వన్డేలో ధారాళంగా పరుగులు ఇచ్చినా కూడా బుమ్రాపై విరాట్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. రెండో వన్డేలో గెలుపే ధ్యేయంగా టీమిండియా బరిలోకి దిగనుంది.టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పడంలోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ టాప్‌లో నిలిచాడు. మంగళవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference