మధ్య తరగతి వారికి బాగా దగ్గరైన మోడల్ బండి వస్తుండటంతో పాటు బజాజ్ కంపెనీ నుంచి వస్తోన్న తొలి ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వారం చివరి నుంచి బుకింగ్ లు మొదలవుతాయని తొలి బ్యాచ్‌ను పూణె, బెంగళూరులలో విడుదల చేస్తున్నారు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ECO మోడ్ ఆఫ్ చేసి నడిపితే 85కిలోమీటర్ల దూరం వస్తుంది. సిటీలో తిరిగే వ్యక్తులకు బాగా సరిపోతుంది. ఈ బైక్ కేటీఎం డీలర్ల వద్ద అందుబాటులో ఉంటుందని మేనేజ్ మెంట్ వెల్లడించింది. పల్సర్, డిస్కవర్, ప్లాటినాలతో పోటీగా దీనిని లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు.బజాబ్ ఆటో ఇండస్ట్రీ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను సంక్రాంతి నాటికి మార్కెట్లోకి తీసుకురానుంది. రెండు దశాబ్దాలుగా వినియోగదారులకు దూరంగా ఉన్న చేతక్ బండిని బ్యాటరీతో నడిచే బైక్ రూపంలో జనవరి 14న లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఒకినావా స్కూటర్స్, హీరో ఎలక్ట్రిక్, ఎథేర్ ఎనర్జీ, ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ట్వంటీ టూ మోటార్స్ వంటి కంపెనీల ఉత్పత్తులకు ధీటుగా ఈ బైక్ ఉండనుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference