కువైట్ కేంద్రంగా అమెరికా బలగాలు మొహరించటంతో పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వేల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న సులేమానీని ఎప్పు డో చంపాల్సిందని ట్రంప్ పేర్కొనగా.. తీవ్రమైన ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.మరోవైపు సులేమానీ హత్యతో ఇరాన్ ఉలిక్కి పడింది. విదేశాల్లో నివసిస్తున్న అమెరికన్ల ప్రాణాలను కాపాడేందుకు.. భవిష్యత్తులో ఇరాన్ చేయబోయే దాడులను అడ్డుకునేందుకు అధ్యక్షుడి ఆదేశాల మేరకు సైనిక చర్య జరిపామని. ఉగ్రవాద సంస్థ కుడ్స్ నాయకుడు సులేమానీని అంతమొం దించామని అమెరికా రక్షణ కార్యాలయం పేర్కొంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference