అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఎగ్జిబిషన్‌కు వెళ్లే సందర్శకుల కోసం విరివిగా ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్ జోన్ ఈడీ కార్యాలయం ఒక ప్రకటనలో చేసింది. బస్సుల ఆపరేషన్ 15వ తేదీ వరకు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే 12వ తేదీ వరకు ప్రతీరోజు 100 బస్సులు నడిపిస్తామని, 13 నుంచి 15 వరకు ప్రతీరోజు 150, సెలవు రోజుల్లో 200 వరకు బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కమ్యూనికేషన్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు సమాచారం కోసం 7382804018, 7382811801 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference