2012, డిసెంబర్ 16వ తేదీ.. ఢిల్లీలో ఆరుగురు మృగాళ్లు నిర్భయపై దాడి చేసి అత్యాచారం చేశారు. యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిర్భయ మృతి చెందింది. ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్ 16నే ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఈ శిక్ష అమలు చేస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు చెప్పారు. తమకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం దోషులు తిహార్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు జూవైనల్ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు. మరో దోషి రామ్‌సింగ్ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు .
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???