గన్నేరువరం మండలం లోని ఖాసీంపెట్ గ్రామంలో సోమవారం రోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి సాగుకి సమాయత్తం అవగాహన కార్యక్రమం నిర్వహించారు వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ వరి మొక్కజొన్న పంటలో మెలైన రకాలను ఎంచుకొని పంటలను సాగు చేసుకోవాలన్నారు కే ఎన్ వై 188 JGL 24423 వరి రకాలు గుండ్లపల్లి గన్నేరువరం డి సి ఎం ఎస్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారుఖాసీంపెట్ లో మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణ లింగ కర్షణ బుట్టలు మెటారైజియా గన్నేరువరం ఆఫీసులో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు అదేవిధంగా రైతు బీమా చేయించుకుని రైతులకు బీమా చేపించు కోవాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వరి మొక్కజొన్న పంటలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా వేరే శీనుగా ధరణి అనే రకాన్ని మినికిట్స్ ను రైతులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న ఎంపిటిసి ఏలేటి స్వప్న చంద్రారెడ్డి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సంధవేణి తిరుపతి, ఉప సర్పంచ్ బద్ధం సంపత్ రెడ్డి, ఏఈఓలు అనూష,సౌమ్య లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.