తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్సార్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థ ఉన్నతి కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. టీఎస్సార్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమంటూ మొదలెట్టిన ఆయన.. ఆ తర్వాత సంస్థ బస్సుల్లో పలు సౌకర్యాలు, బస్టాండ్లలో కీలక వసతులు ఏర్పాటు చేస్తూ సాగుతున్నారు. అందులో భాగంగా టీఎస్సార్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి గురువారం ఆయన ఓ బంపరాఫర్ ప్రకటించారు.
టీఎస్సార్టీసీ బస్సుల్లో ప్రయాణించిన సందర్భంగా మీకు ఎదురైన అనుభవాలను చెప్పాలని పిలుపునిచ్చిన సజ్జనార్… ఎంపిక చేసిన వాటికి రివార్డులు ఇస్తామంటూ గురువారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్‌ను పెట్టారు. ఈ పోస్ట్ ప్రకారం.. టీఎస్సార్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన వారు పంపే అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న వాటిని పంపిన వారికి టీఎస్సార్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారట.
Hey guys it’s time to Cherish your memories with #TSRTC on a hot summer day!
Share the best thing happened to you while travelling in #TSRTCBuses and the most touchy story will be rewarded. #MemoriesOnWheels #thursdayvibes #ThursdayThought pic.twitter.com/fpCpvNagOQ
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) April 7, 2022