టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తన 15వ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, షూటింగ్ కు గ్యాప్ రావడంతో రామ్ చరణ్ అమృత్ సర్ కు సమీపంలోని ఖాసా సరిహద్దుల వద్దకు వెళ్లారు.
అక్కడ దేశ రక్షణ విధుల్లో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లను కలిశారు. జవాన్లతో ముచ్చటించడమే కాదు, వారితో కలిసి భోజనం కూడా చేశారు. ఎంతో ఉత్సాహంగా ఫొటోలు దిగి జవాన్లను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్లో శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.