- శాంతియుత నిరసనలపై అక్రమ కేసులు దుర్మార్గం..
- అంగలూరు ఎస్సీ కాలనీలో నిరసన పై విచారించండి
- అక్రమ కేసులు కడుతున్న ఎమ్మెల్యే బంధువు ఎస్సై పై చర్యలు తీసుకోండి
- పల్నాడు జిల్లా ఎస్పీకి పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవి ఆంజనేయులు వినతి
నరసరావుపేట:వినుకొండ నియోజకవర్గం లోని ఈపూరు మండలం అంగలూరు గ్రామం SC కాలనీలో గత ఏడాది డిసెంబర్ నెలలో వరుసగా మూడు రోజులపాటు కరెంట్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో విద్యుత్ శాఖ SC కాలనీకి కరెంటు సరఫరా నిలిపివేయడంతో నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నాడు ఎస్సీ కాలనీ వాసులతో కలిసి కాలనీలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టగా
ఈపూరు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి నాలుగు నెలల తర్వాత నోటీసులు ఇవ్వడం దారుణమని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.
కరెంటు బిల్లులు చెల్లించలేదని కాలనీ కి కరెంటు కట్ చేయడంతో అందకారంగా మారి విష సర్పాలు కీటకాల సంచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కాలనీ వాసులు భయాందోళనలు చెందుతున్న పాలకులు అధికారులు స్పందించకపోవడంతో బాధితులు తమను సంప్రదించగా విద్యుత్ శాఖ అధికారులతో చర్చించడం జరిగిందన్నారు.
50 యూనిట్ల లోపు ఎస్సీ, ఎస్ టి కాలనీ లకు ఉచిత విద్యుత్ అని ప్రకటించిన ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని కరెంటు తొలగించడం చట్టవిరుద్ధమని తెలియపరిచిన స్పందన లేకపోవడంతో కాలనీ వాసులతో కలిసి నాడు నిరసన చేపట్టడం జరిగిందన్నారు.
రెండు లైట్లు, ఒక ఫ్యాన్, వినియోగించుకునే కాలనీ వాసులకు కరెంటు సరఫరా నిలిపి వేయడం చట్ట విరుద్ధమని ప్రశ్నించిన పాత బకాయిలు మొత్తం చెల్లి ఇస్తేనే ఎస్సీ కాలనీకి కరెంటు సరఫరా చేస్తామని సమాధానం ఇవ్వడంతో అంగలూరు ఎస్సీ కాలనీ వాసులతో కలిసి లాంతర్లు, దీపాలు పెట్టుకుని వీధిలో రోడ్డుపై బస చేసి, నిద్రించి ఎస్సీ కాలనీ కి విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా మరుసటి రోజు ఉదయం వరకు నిరసన తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. స్పందించిన ఉన్నతాధికారులు ఎస్సీ కాలనీ కి కరెంటు సరఫరా చేయటం జరిగిందని, ఎస్సీ కాలనీ వాసులు సమస్యపై శాంతియుతంగా నిరసన తెలియ జేస్తే ఈపూరు పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి నాలుగు నెలల తర్వాత తనకు నోటీసు ఇచ్చేందుకు సోమవారం వచ్చారని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే భావప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలియజేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
ఆ హక్కులను కూడా అతిక్రమించి పోలీసులు అక్రమ కేసులు బనాయించడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమేనని మంగళూరు ఎస్సీ కాలనీలో జరిగిన నిరసన పై సమగ్ర విచారణ జరిపి ఎస్సై తమపై, పార్టీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు వ్యక్తి వేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈపూరు ఎస్సై వెంకట్రావు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు దగ్గరి బంధువు కావడంతో స్వామి భక్తి చాటుకునేందుకు టీడీపీ కార్యకర్తలపై నాయకులపై ఇటువంటి అక్రమ కేసులు పెట్టడమే కాక, ప్రజా సమస్యలపై ప్రశ్నించడం కూడా నేరంగా భావించి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, అంగలూరు ఎస్సీ కాలనీలో శాంతియుతమైన నిరసన పై ఈపూరు ఎస్సై బనాయించిన అక్రమ కేసులు పై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేసి పోలీసులపై ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.
టిడిపి కార్యకర్తలు నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు పై కూడా నిష్పక్షపాతమైన విచారణ జరిపి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని వారు కోరారు.
స్పందించిన ఎస్పీ కేసులపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తానని చెప్పారు.