ప్రభుత్వంలో మరో కీలక నియామకం జరిగింది. ప్రభుత్వ పనితీరును జనంలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన తెలంగాణ సమాచార, పౌర సంబంధాలు (ఐఅండ్‌పీఆర్)శాఖ డైరెక్టర్‌గా రాజమౌళిని నియమిస్తూ మంగళవారం తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిని దక్కించుకున్న రాజమౌళి మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ పదని ఇచ్చినందుకు ఆయన ఈ సందర్భంగా కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు (డైరక్టర్) గా శ్రీ బి. రాజమౌళి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తనను డైరక్టర్ గా నియమించినందుకు ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపిన శ్రీ బి. రాజమౌళి. pic.twitter.com/2LIu6rg8kN
— Telangana CMO (@TelanganaCMO) April 19, 2022