- పోలీసులమని చెప్పి రూ. 90,00,000/- దోపిడీ చేసిన ముద్దాయిలను పట్టుకున్న ఈస్ట్ పోలీసులు.
- జిల్లా యస్.పి పి.పరమేశ్వర రెడ్డి, ఆదేశాల మేరకు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేధించిన పోలీసులు.
- సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్లి కేసు చేదన.
- పత్రికా ముఖంగా వెల్లడించిన జిల్లా యస్.పి పి.పరమేశ్వర రెడ్డి,
తిరుపతి :-90 లక్షల రూపాయల రాబరి కేసులో ఏడుగురు ముద్దాయిలను ఈస్ట్ పోలీసులు గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి 88 లక్షల రూపాయలను, ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తిరుపతి జిల్లా యస్.పి పి.పరమేశ్వర రెడ్డి, సూచనల మేరకు విచారణ చేపట్టిన పోలీసు బృందాలు ఏప్రిల్ 9వ తేదీన నేరము జరగగా 11 వ తేదీ ఫిర్యాదు చేయడంతో, 21వ తేదీన చేదించడం జరిగింది.
నరసరావుపేటకు చెందిన మెహర్ శ్రీనివాస్ తన యజమాని సతీష్ ఇచ్చిన 90 లక్షల రూపాయల నగదుతో 8వ తేదీ రాత్రి బస్సులో తిరుపతికి బయలు దేరాడు.
విషయం తెలుసుకున్న తిర్లిక శ్రీనివాసరావు, దుర్గారావు పథకం ప్రకారం మరో ఆరుగురితో కలిసి నరసరావుపేట నుంచి ఇన్నోవా లో కొందరు, బస్సులో మరికొందరు మెహర్ శ్రీనివాసను అనుసరిస్తూ తిరుపతి చేరుకుంటారు.
మెహర్ శ్రీనివాస్ తిరుపతి చేరుకున్న తర్వాత హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ వద్ద బస్సు దిగగానే ఇన్నోవా కారులో వచ్చిన వ్యక్తులు తాము ఐడి పార్టీ పోలీసులమని చెప్పి శ్రీనివాస్ ను బలవంతంగా కారులో ఎక్కించుకొని నాయుడుపేట పూతలపట్టు హైవే మీదుగా బెంగళూరు వైపు కొంతదూరం తీసుకెళ్లి బెదిరించి అతని వద్ద నుంచి 90 లక్షల రూపాయలు లాక్కొని, అక్కడే శ్రీనివాస్ ను వదిలి వారు కారులో పరారయ్యారు.
ఫోన్ లేకపోవడంతో శ్రీనివాస్ కొంతసేపు ఇబ్బంది పడ్డ తర్వాత అటుగా వెళ్తున్న వారి నుంచి ఫోన్ తీసుకొని తన యజమాని సతీష్ కు ఫోన్ చేసి జరిగిన సంఘటన తెలియపరిచాడు.
యజమాని సతీష్ సూచనల మేరకు నరసరావుపేట చేరుకున్న శ్రీనివాస్ ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు వివరాలు తెలుసుకున్న సి.ఐ గారు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు.
పోలీసు విచారణలో ఎనిమిదిమంది ముద్దాయిలు హస్తం ఉన్నట్లు తేలగా, వారిలో A2 కోర్టులో లొంగిపోయాడు. మిగిలిన ఏడు మంది ని పోలీసులు అరెస్టు చేశారు.
ఎన్ హెచ్ -16 (చెన్నై-కోల్కతా హైవే) పై నాయుడుపేట మండలం లోని నాయుడుపేట క్రాస్ వద్ద వీరిని అరెస్టు చేసి వీరి నుంచి 88 లక్షల రూపాయలు నగదు, దోపిడీకి ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ 90 లక్షల రూపాయల రాబరి కేసును కేవలం 9 రోజులలో చేధించిన ఈస్ట్ పోలీసు బృందాన్ని డి.ఎస్.పి మురళి కృష్ణ, సీఐ శివప్రసాద్రెడ్డి యస్.ఐ లు ప్రకాష్ కుమార్, నాగేంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ మునిరాజు, కానిస్టేబుల్ టీ.ప్రభాకర్, టీ.ఈశ్వరయ్య లను ఆయన అభినందించి రివార్డ్ ఇచ్చి కేసు వివరాలను తెలియజేశారు.
మెహర్ శ్రీనివాస్ అనే వ్యక్తి తన యజమాని నుంచి 90 లక్షలు చేస్తున్న విషయం పసిగట్టి, నరసరావుపేట నుంచి అతడిని అనుసరించి తిరుపతి లో దొంగతనం చేయడం జరిగింది.
ఫిర్యాదు అందుకున్న తొమ్మిది రోజుల్లోనే కేసును ఛేదించడం అభినందనీయమన్నారు.
దొంగతనానికి పాల్పడిన ముద్దాయిల వివరాలు తెలియజేస్తూ,
అరెస్ట్ కాబడిన ముద్దాయిలు:-
1. తిర్లిక శ్రీనివాసా రావు, వయస్సు- 46 సం.లు, తండ్రి పేరు- T.కోటేశ్వర్ రావు, కరెంట్ ఆఫీసు రోడ్డు, సింధు స్కూల్ ఎదురుగా, నరసారావుపేట టౌన్ మరియు జిల్లా, వృత్తి- బంగారం వ్యాపారం.
2. దుర్గారావు [కోర్టు లో సరెండర్ అయినాడు]
3. విరీసెట్టి శ్రీను, వయస్సు- 30 సం.లు, తండ్రి పేరు- V.చంద్రం, కొండేపల్లి రోడ్డు, శ్రీనగర కాలనీ, మార్కాపురం టౌన్, ప్రకాశం జిల్లా, వృత్తి:-రియల్ ఎస్టేట్ వ్యాపారం.
4. వీరనాల గంగాధర్, వయస్సు- 27 సం.లు, తండ్రి పేరు- వెంకటేశ్వర్లు, గన్నెపల్లి గ్రామం, ఆర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా, వృత్తి:- వ్యవసాయ కూలీ.
5. సయ్యద్ హుస్సైన్ బాష @ కరాటి మున్నా, వయస్సు 31 స,,లు తండ్రి పేరు సయ్యద్ ఖాసిమ్ బాష, డోర్ నెంబర్ 1-203/C/20A, పూల సుబ్బయ్య కాలనీ , తాళ్ళూరు పాడురోడ్డు, మార్కాపురం టౌన్, ప్రకాశం జిల్లా, వృత్తి- వంట మాస్టర్.
6. పటాన్ రసూల్, వయస్సు- 38 సం.లు, తండ్రి పేరు – లేట్ పటాన్ వల్లి,డోర్ నెంబర్.1/153, ఆర్‌టిసి బస్సు స్టాండ్ వెనుకల,మార్కాపురం టౌన్, ప్రకాశం జిల్లా, వృత్తి-కూలీ.
7. సయ్యద్ హుస్సైన్ బాష @ పెద్ద మున్నా, వయస్సు 33 స,,లు తండ్రి పేరు సయ్యద్ దూద్ బాష, 3rd line, సొసైటి కాలనీ, గిద్దలూర్ టౌన్, ప్రకాశం జిల్లా, వృత్తి:- పండ్ల వ్యాపారం.
8. మున్నంగి రమేశ్, వయస్సు- 22 సం.లు, తండ్రి పేరు- M.ఎమ్మనుయాల్, గోగుల దిన్నె గ్రామం,SC కాలనీ, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా, వృత్తి:- డ్రైవరు