contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో విషాదం .. బుల్డోజర్ టైరు పేలి ఇద్దరు మృతి

బుల్డోజర్ టైరుకు గాలి పడుతున్న సమయంలో… అది పేలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాయ్ పూర్ లోని సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ వర్క్ షాప్ లో టైరుకు గాలి పడుతున్న సమయంలో ఒక వ్యక్తి టైరుపై కూర్చొని ఉన్నాడు. మరోవ్యక్తి టైరు వద్దకు వచ్చాడు. టైరులో ప్రెజర్ ఎంతుందనే విషయాన్ని వీరు చెక్ చేస్తున్నారు. ఈ సమయంలోనే టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో వీరు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మృతులిద్దరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :