APSP 6వ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్పీ విశాల్ గున్ని విజయవాడ రైల్వే పోలీస్ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయము విదితమే.
ఈ సందర్బంగా విజయవాడ రైల్వేస్టేషన్ను పరిశీలించి,ప్రయాణికుల భద్రత మరియు సంరక్షణ గురించి రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ,.
రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ ఫార్మ్స్ మరియు పరిసర ప్రాంతాల్లో కలియ తిరిగి పరిశీలించి,అక్కడ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ.
ఫ్లాట్ ఫార్మ్స్ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రత మరియు సంరక్షణ కొరకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా తగినంత మంది సిబ్బందితో నిరంతర గస్తీ నిర్వహించాలని రైల్యే పోలీస్ అధికారులను ఆదేశించిన ఎస్పీ.
రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫార్మ్స్ మరియు పరిసరాలలో సంచరించే అనుమానితులు మరియు పాత నేరస్తుల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించాలని సూచించారు.
తదనంతరం రైల్వే పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి,అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ఎస్పీ పరిశీలించడం జరిగినది.
రైల్వే స్టేషన్ రక్షణ మరియు భద్రతలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని,వాటిని నిశితంగా పరిశీలించాలని,అనుమానితుల కదలికలను పసిగట్టి వెంటనే పైఅధికారులకు తెలియపరచాలని సిబ్బందికి ఆదేశించినారు.
రైల్వే పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వహించి, ప్రయాణికుల భద్రత మరియు సంరక్షణ పట్ల భరోసా కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు రైల్వే డీఎస్పీ నాగార్జున రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీను ,సాయినాధ్ ,ఆరై ప్రసాదరావు లు,సిబ్బంది పాల్గొన్నారు.